Etela Rajender : వారెవ్వా ఈటల… తెలుగు మీడియాకి రెండు సూటి ప్రశ్నలు..!

Etela Rajender : తెలంగాణ మాజీ  మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender)పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. నాలుగు ఛానెల్స్ సాయంత్రం నుంచి ఊకదంపుడుగా కథనాలు ప్రసారం చేశాయి. అందులో మతలబేమిటో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.

సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అందులోనూ పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈటల ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలను ఖండించారు. ఈ మూడో అంశంలోనూ ఆశ్చర్య పడేంతగా ఏమీ లేదని చెప్పాలి.

Need to review Arogyasri: Eatala Rajender
Etela Rajender (File Photo)

ఈటల మాట్లాడిన తీరు మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియాను ఈటెల లాంటి రెండు మాటలతో గుచ్చేశారు. నేను భూ కబ్జా చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎవరైనా వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశారా.. ఇదీ ఈటల మొదటి ప్రశ్న.

ప్రతీ విషయానికి ఏదో పోలీసు దర్యాప్తు లెవల్లో రాసేసే మీడియా.. ఈ సారి ఈటలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈటల ప్రెస్ మీట్ వరకు కూడా ఎక్కడా ఇన్వెస్టిగేట్ చేసిన దాఖలాలు కనిపించలేదు..

ఈటల అడిగిన రెండో ప్రశ్న ఏమిటో తెలుసా.. కథనాన్ని ప్రసారం చేసే ముందు నా రియాక్షన్ తీసుకున్నారా.. అని.. దీనితో పాత్రికేయుల ఫీజులు మాడిపోయినయి. ఎంత దాచుకుందామన్నా నా ఎమోషన్ దాగడం లేదు.

Telangana: Aarogyasri to cover kidney, heart transplantation
Ex Minister Etela Rajendar

అందుకే ఈ రెండు మాటలు.. వామ్మో.. పాత్రికేయం తన ప్రధాన సూత్రాలను మరిచిపోయినట్లు ఈటల ఎంత నిర్మొహమాటంగా గుర్తు చేశారు. వారెవ్వా ఈటల…

Annapragada bollamraju

 

Also Read :