Politics

మంత్రులుగా కాకపోయినా మనుషులుగా చూడండి : ఈటెల

కారు గుర్తు మీద గెలిచామని మీరంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

నా రాజకీయ జీవితం తెరిచినా పుస్తకమని, 19ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతిరహిత నాయకుడిగా పేరు సంపాదించుకున్నానని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రలోభ పెట్టిన లొంగలేదని, పార్టీకి, ప్రభుత్వానికి ఏనాడూ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని అన్నారు.

ఇక కేసులకి, అరెస్ట్ లకి ఈ ఈటెల భయపడేవాడిని కాదని అన్నారు. చావడానికైనా సిద్దేమ కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకలేనని అన్నారు. క్యాబినెట్ మంత్రులుగా కాకపోయినా మనుషులుగా చూడాలని కేసీఆర్ కి హితవు పలికారు.

ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న ఏ ఒక్క మంత్రి కూడా ఆత్మగౌరవంతో ఉన్నామని చెప్పుకోలేరని అన్నారు. తానూ రాజీనామా చేసేముందు హుజరాబాద్ ప్రజలతో ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

Also Read :