Cinema

Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్

Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్.

dhee-13
dhee-13

స్టెప్పేస్తే స్టేజ్ దద్దరిల్లిపోవాలి. పెర్ ఫార్మెన్స్ చూసి షో జడ్జీలు అదిరిపోవాలి. కో పార్టిసిపెంట్స్ విజిల్స్ మోత మోగించాలి. ఇక ప్రదీప్, రష్మీ లాంటి వాళ్లు.. శభాష్ అనాలి. ఢీ 13.. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ప్రోమో చూస్తే .. ఇవే ఫీలింగ్స్ కలుగుతాయి. అసలా ఎనర్జీ ఏంటి.. ఆ డ్యాన్స్ ఏమిటి.. బాబోయ్.. షో అంటే అది. వెయ్యివాట్స్ పవర్ ఒక్కసారి చూస్తే ఎలా ఉంటుందో.. అంతా పవర్ ఫుల్ గా ఉంటుంది వాళ్ల డ్యాన్స్.

D-13 Dance
D-13 Dance

ఢీ 13.. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోకి జడ్జీలిగా పూర్ణ, ప్రియమణి, మాస్టర్ వచ్చారు. పార్టిసిపెంట్స్ వేస్తు్న్న స్టెప్పులకు, దానికి జడ్జెస్ ఇస్తున్న ఎంకరేజ్ మెంట్ కు.. భలే కుదిరింది. మధ్యలో ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. షోని భలే రక్తి కట్టిస్తాయని ప్రోమోను చూస్తేనే అర్థమవుతుంది.

ప్రోమోలో ఫస్ట్ సాంగ్ కింద బాయ్స్ సినిమాలో సాంగ్ వస్తుంది. నిజంగా ఆ పాటకు వాళ్లు వేసిన డ్యాన్స్ చాలా బాగుంది. జడ్జీస్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కూడా అంతేలా ఉన్నాయి. పూర్ణ అయితే.. అభి డ్యాన్స్ కి ఫిదా అయిపోయి.. ఏకంగా లవ్ సింబల్ చూపించడంతో అక్కడున్నవాళ్లంతా ‘ఓ’ వేసుకున్నారు. అంతలా అందర్నీ ఆకట్టుకుంది.

Nadhi Nakkileesu Golusu Song
Nadhi Nakkileesu Golusu

రెండో సాంగ్ కింద నాది నక్కిలీసు గొలుసు సాంగ్ పెర్ ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అందరితో స్టెప్పులేయించింది.

తరువాత మన్మథ సినిమాలో శింబు సాంగ్ ని పెర్ ఫార్మ్ చేశారు. అది కూడా అందర్నీ ఫిదా చేసింది. కాదన్నా ప్రేమే.. అవునన్నా ప్రేమే.. అంటూ వాళ్లు పాడిన పాట రియల్లీ సూపర్బ్. ఇందులో సాయి పెర్ ఫార్మెన్స్ అదుర్స్. అందుకే తనకి ఉన్న ఆర్థిక కష్టాలను చూసి.. మాస్టర్ నిజంగా చలించిపోయారు. అందుకే ఎంత అప్పు ఉందని అడిగితే.. నాలుగు లక్షలని సాయి చెబుతాడు. సరే.. ఈ షో అయిపోయాక రా.. తీసుకుని పో అని చెప్పేసరికీ.. షోలో ఉన్నవాళ్లంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి.. చప్పట్లతో అభినందనలు తెలిపారు.

 

sudeer-&-Rasmi
sudeer-&-Rasmi

మాస్టర్ కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఫ్యాన్ కావడం, ఆయన దగ్గరి నుంచే తనకి ఈ సాయం చేసే గుణం వచ్చిందని చెప్పడంతో మళ్లీ అంతా ఫిదా అయిపోయారు.

మొత్తానికి ఢీ 13.. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ప్రోమో ఫుల్లీ పవర్ ప్యాక్ అని చెప్పాలి. ఎనర్జీ లెవల్స్ ని ఫుల్ గా రీచ్ అయిపోయింది. వ్యూయర్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని ఫుల్లుగా అందుకుందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి : 

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!

Also Read : Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః

Also Read : Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : Corona Virus : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage