Bhakthi

Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనుర్రాశి (Horoscope Dhanassu Raasi saggitarius) రాశి ఫలాలు :

మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం 11, వ్యయం – 05, రాజ పూజ్యం – 07, అవమానం – 05

పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి యంత్ర సంబంధ వ్యాపార వ్యవహారములో విజయం పొందుట సూచించుచున్నది.

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురు గ్రహం వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ జీవనంలో సుఖ లేమి ఎదుర్కొందురు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చును లేదా చోరుల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కొనుట లేదా ఆరోగ్య సమస్యలు పొందుట జరుగును. సొదరీ వర్గం వలన ప్రయోజనం పొందుతారు. వారి వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.

ధనుర్ రాశి(Horoscope Dhanassu Raasi saggitarius) వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే శనైచరుని వలన ఇబ్బందులు కొనసాగుతాయి. కష్టం మీద తలచిన విధంగా ధనాన్ని కూడబెట్టగలుగుతారు. మొదటి వివాహం నష్టపోయి , పునర్ వివాహ ప్రయత్నాలు చేయు వారికి ఈ ప్లవ నామ సంవత్సరం పునర్ వివాహ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పరచును ధనుర్ రాశి వారు ఈ ప్లవ నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. తరచుగా ఏలినాటి శని ప్రతికూల ప్రభావ నిర్మూలన కోసం శని కి శాంతి జపములు చేయించుకొనుట మంచిది.

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇరువురూ సంవత్సరమంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహు – కేతువులు ఉచ్చ లేదా స్వక్షేత్ర ములలో ఉన్న వారు సమాజంలో విశేష ఖ్యాతిని ఆర్జించెదరు. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా లభించును. దేవాలయములు లేదా ధార్మిక కేంద్రాలను నిర్మించుటలో పాత్ర వహిస్తారు.

ఏప్రిల్ 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో గృహం వాతావరణంలో వివాదాల వలన చికాకులు ఎదుర్కుంటారు. ధనాదాయం సామాన్యం. వృత్తి వ్యాపారములలో వాతావరణం ఆశించిన విధంగానే కొనసాగును. సంతాన పరంగా శుభకరమైన ఫలితాలు పొందుతారు. బహుమతులు పొందుతారు. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించడం చాలా ముఖ్యం. తృతీయ వారంలో శారీరక రుగ్మతలు , సమయ పాలన కోల్పోవుట వంటి చికాకులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి కొనసాగుతుంది. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. ఈ మాసంలో ధనానికి లోటు రాదు.

మే 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో మానసిక ఒత్తిడి అధికం. కానీ ఆదాయం బాగుండును. రావలసిన ధనం చేతికి వచ్చును. ద్వితియ వారంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం అంతగా బాగుండదు. ముఖ్యంగా ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కూడా అననుకూలత ఉన్నది. వ్యాపారులకు ఆశాభంగములు ఎదురగును. రాజకీయ పదవుల కోసం తీవ్రంగా శ్రమించవలెను. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం అగును. తలపెట్టిన పనులు హడావిడిగా సాగుతాయి. ఆగ్రహవేశాలు అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసంలో 24,25 తేదీలలో ఉద్రేకం వలన నష్టం మరియు మిత్రు వర్గీయులతో శత్రుత్వములు ఏర్పడు సూచనలు ఉన్నవి.

జూన్ 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసం బాగుండును. ఆశపెట్టుకున్న విధంగా ధనాదాయం పెరుగును. వృత్తి వ్యపారాదులలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనం లోని వారికి పై అధికారుల వలన కొద్దిగా ఒత్తిడి ఎదురగును. మూత్రపిండ లేదా కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు భాదించును. కానీ ఆయుర్ధాయ గండం ఉండదు విద్యార్ధులకు విద్యా అవకాశ సంబంధ వ్యవహారములు సానుకూలంగా పూర్తి అగును. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించవలసి వచ్చును. కుటుంబంలో నడుస్తున్న ఆధిపత్య పోరు కొంత బాధించును.

జూలై 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో కుటుంబం లోనూ , వృత్తి వ్యాపార జీవనంలోనూ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడును. ఆశించిన విధంగా లాభకరమైన వాతావరణం కలిగి ఉందురు. సంతాన ప్రయత్నాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. సొంత వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. గత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. చివరి నిమిషంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొందురు. 18 నుండి 23 వ తేదీ మధ్య ఆహార సంబంధ అనారోగ్య బాధించును. 25 వ తేదీ తదుపరి మాసాంతంలో అందరి మన్ననలు లభిస్తాయి.సంతోషకర రోజులు.

ఆగస్టు 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో ద్రవ్య నష్టములు ఎదుర్కొందురు. సొంత మనుష్యుల గురించిన మీ అభిప్రాయాలు తలక్రిందులు అవుతాయి. వృత్తి జీవనంలోని వారికి అనుకోని రీతిలో ఖర్చులు ఎదురగును. కుటుంబంలో పితృ వర్గీయులకు ఆరోగ్య గండాలు ఉన్నవి. విదేశీ ఉద్యోగ జీవనం చేయువార్కి స్థిరాస్తి నష్టములు లేదా విసా సంబందిత ఇబ్బందులు ఏర్పడు అవకాశం ఉన్నది. స్త్రీలకు అపవాదులు మరియు మనశ్శాంతి లోపించుట వంటి సంఘటనలు ఉన్నవి. ఈ మాసంలో విలాసాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. గర్భిణి స్త్రీలు జాగ్రత్త వహించవలెను.

సెప్టెంబర్ 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగును. నూతన గృహ నిర్మాణ లేదా వస్తు మార్పిడి సంబంధమైన పనులకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతి ని ఆశించవచ్చు.మీ పనుల పట్ల శ్రద్ధా శక్తుల వలన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారం వలన మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్న శుభవార్త వినుదురు.

అక్టోబర్ 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో కొంత అననుకూల పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో మనసుకు నచ్చని స్థానభ్రంశం, విద్యార్ధులకు విద్యావిఘ్నత, మహిళలకు శరీర హాని వంటి ప్రతికూల ఇబ్బందులు ఏర్పడును.వ్యాపార రంగం వార్కి కూడా ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. ఇటువంటి వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి అనుభవించెదరు. అనవసర ఖర్చులు పెరుగును.తృతీయ వారము ఉద్యోగ జీవులకు శ్రమకరంగా ఉండును.ఈ మాసంలో 7, 9,12,13, 21, 27 తేదీలు అనుకూలమైనవి కావు.

నవంబర్ 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసం కొంత అనుకూలంగానే ఉండును. ఆదాయం సామాన్యంగా ఉండును. ఆశించిన విధంగా నిల్వ ధనం ఏర్పరచుకోగలరు. పెట్టుబడులు, శ్రమ వృధా కావు. చాకచక్యత ప్రదర్శిస్తారు. మీ వ్యతిరేకులు మీకు సన్నిహితంగా నటించి ధన సహాయం అర్దిస్తారు.వారిని అతిగా నమ్మి హామీలు ఇవ్వకూడదు. ఈ మాసంలో 3,16,17,25,26 తేదీలు ఎదో తెలియని వెలితి వెన్నాడుతుంది.ఆందోళన చెందుతారు.

డిశంబరు 2021 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కుటుంబ చికాకులు కొనసాగును. మహిళలు నిరాదరణ వలన భాదించబడతారు. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. ఈ మాసం 12, 13 తేదీలలో శరీరమునకు అలసట మరియు 20 నుండి 25 వ తేదీ మధ్య ఉద్యోగ జీవనము లో ఒత్తిడి, నడుస్తూ ఉన్న పనులలో విఘ్నతలు కలిగి చికాకులు ఏర్పడును. ఈ మాసంలో తలపెట్టిన ఆలోచనలు సజావుగా కార్యరూపం దాల్చవు.

జనవరి 2022 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం. మీపై వచ్చిన అభియోగాలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వగలరు. ఈ మాసంలో వ్యవహార అనుకూలత ఉంది. సంస్థల సభ్యత్వాలు తీసుకొనుట కలసి వస్తుంది. మిత్రుత్వాలు బలపడతాయి. మాస మధ్యమంలో దైవ దర్శనం, పారమార్ధిక చింతన వంటి కార్యముల వలన ఆహ్లాదకరమైన కాలం ఏర్పడుతుంది. ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.వివాహ ప్రయత్నములకు మధ్యమ ఫలితాలు లభించును. పుత్ర సంతానమునకు అనుకూలమైన కాలం.

ఫిబ్రవరి 2022 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసం అనుకూలమైన మాసం. నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. అవసరమైన ధనం సమయానికి చేతికి లభించును. ఇరుగుపొరుగు వారి వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఆలోచనలు సక్రమంగా ఉండును. పనుల భారం వలన అలసట ఏర్పడును. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు బాధించును. నూతన విషయాల పట్ల ఆసక్తి పెరుగును. స్థిరాస్థి పత్రాలు మీ చేతికి వస్తాయి.

మార్చి 2022 ధనుర్ రాశి ఫలాలు:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. బంధు మిత్రుల కలయిక వలన మానసిక ఉల్లాసం పొందుతారు. అతిధి సత్కారములకు ధన వ్యయం ఏర్పడుతుంది. స్థాన చలన ప్రయత్నములకు అనుకూలత ఉంది పనులలో ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు సద్దుమనుగుతాయి. ధనాదాయం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. ఆశించిన ప్రమోషన్లు లభించుట కష్టం. పెద్దల సలహాలు పాటించుట మంచిది. ఈ మాసంలో 15, 22, 23, తేదీలు అంత అనుకూలమైనవి కావు.

– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

Also Read : Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు

Also Read : Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల

Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు

Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  కర్కాటక రాశి ఫలాల

Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  సింహ రాశి ఫలాలు

Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

Also Read :   Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు

 Also Read : Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Also Read : Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

Also Read : Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage