పుదుచ్చేరిలో గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అనడం హాస్యాస్పదం – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పటం కప్పదాటు వైఖరే – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే నీతి అయోగ్ సూచనమేరకు ‘ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రులు పదేపదే చెప్పారు.

ఇప్పుడు మాట మార్చి పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై రాష్ట్ర బిజెపి నేతల వైఖరి స్పష్టం చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు సమాధానం చెప్పాలి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బిజెపిని నిలదీయాలి.
– రామకృష్ణ.