Off Beat

coronavirus in dust : ధూళిలో కూడా కరోనా ఉంటుందట.. అదీ నెల రోజులంట.. మరి తప్పించుకునేదెలా?

coronavirus in dust : ధూళిలో కూడా కరోనా ఉంటుందట.. అదీ నెల రోజులంట.. మరి తప్పించుకునేదెలా?

coronavirus in dust : మో గాలి ద్వారా కూడా సోకుతుంది అన్నారు. ఇప్పుడేమో ఏకంగా ధూళిలో కూడా కరోనా ఉంటుందట. అది కూడా ఒక.  గంవామ్మో! ఏం కరోనారా బాబు ఇది. మొన్నమో.. తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది అన్నారునిన్నేటో, ఒక రోజో కాదు.. ఏకంగా నెల రోజుల పాటు బతికుండగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి మాటలు వింటే.. కరోనా (coronavirus in dust) పీడ ఎప్పుడు విరగడవుతుందిరా నాయనా అని బాధపడతాం.

The Future Of Education Post The Corona Pandemic -Raghav Chandra - BW Businessworld

కరోనా వైరస్ ఎక్కడ ఎంత కాలం :

నిజానికి అందరూ కలిసికట్టుగా పోరాడితే కరోనాను రెండు మూడు నెలల్లోనే అంతం చేయవచ్చు. కానీ కొందరు మాస్కులు వేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లే సమస్య మరింతగా పెరుగుతోంది. అలాగని అందరూ మడిగట్టుకుని ఇంట్లో కూచోవాలంటే కుదరదు. కానీ కనీస జాగ్రత్తలను పాటించడం వల్ల కొంతయినా ఉపయోగముంటుంది కదా. అసలు.. కరోనా వైరస్ ఎక్కడ ఎంతకాలం ఎలా బతికుంటుందనే దానిపై చాలా దేశాలు అధ్యయనం చేస్తున్నాయి.

ధూళిలో నా వైకరోరస్ పై అమె రికా యూనివర్సిటీ పరిశోధన :

చాలా ప్రాంతాల్లో వ్యర్థ జలాలు, మురుగునీటిపై పరిశోధన చేశారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని బట్టి తేలింది ఏమిటంటే.. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కొవిడ్ లక్షణాలు లేవు. కానీ కొవిడ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి మాత్రం ఈ అధ్యయనం ఉపయోగపడింది. అలాగే ధూళిలో కరోనా ఉంటుందేమో అని అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. దీనివల్ల ఆసుపత్రులు, స్కూళ్లలో కరోనా లెవల్స్ ఏ విధంగా ఉంటాయో తెలుస్తుంది.

Scientists warn on flu & COVID-19: Says Influenza viruses can spread through dust, non-respiratory particles | Scientists News – India TV

 

ధూళి నమూనాల్లో 97 శాతం, ఉపరితల నమూనాల్లో.. :

ఆసుపత్రుల్లో కరోనా రోగులు ఉన్న గదుల్లో పరిశీలన చేశారు. పాజిటివ్ వచ్చిన వారి ఇళ్ల నుంచి కూడా శాంపిల్స్ ను సేకరించారు. అలాగే వాక్యూమ్ బ్యాగ్ ల నుంచి ధూళిని కూడా సేకరించారు. గదుల ఉపరితలం నుంచి నమూనాలను తీసుకున్నారు. దీంతో అసలైన నిజం వెలుగుచూసింది. ధూళి నమూనాల్లో 97 శాతం, ఉపరితల నమూనాల్లో 55 శాతం మేర కరోనా జన్యుపదార్థమైన ఆర్ఎన్ఏ బతకగలుగుతోందని తేలింది. ఇది నిజంగా ఆశ్చర్యపోయే విషయం.

ఇక్కడ ఇంకా స్పష్టం కావాల్సిన విషయం ఒక్కటే. ఈ ధూళి నుంచి వైరస్ మనుషులకు సోకుతుందా.. అసలు అలా వైరస్ ను వ్యాప్తి చేసే గుణం ఆ ధూళికి ఉందా లేదా అన్నదే ఇంకా తేలాలి. ఎందుకంటే శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా పరిశోధనను చేయలేదు. అసలు ధూళిలో ఉన్న సమయంలో కరోనా వైరస్ లోని కొమ్ముల్లాంటి ఆకృతులతో ఓ పొర బయట ఉంటుంది. అది కొంత కాలానికి విచ్ఛిన్నమైపోతుంది. మీకో విషయం తెలుసా.. మనుషుల్లో వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేయడంలో ఈ పొరే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

గాలిలో వైరస్ ప్రభావంపై సీసీఎంబీ పరిశోధన :

ఆమధ్య మన సీసీఎంబీ వాళ్లు కూడా కరోనా వైరస్ పై ఓ పరిశోధన చేశారు. ఆసుపత్రుల్లో.. కొవిడ్ రోగుల సంఖ్య, వారు ఉండే సమయం ఆధారంగా గాలిలో వైరస్ ప్రభావం ఉంటుందని దాని అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన రోగులను ఓ క్లోజ్డ్ రూమ్ లో కాసేపు ఉంచి వాళ్లు వెళ్లిన తరువాత అక్కడి నమూనాలను పరీక్షించారు. దీంతో రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఏసీ రూమ్ లు, ఐసీయూల్లో కొన్ని గంటల తరువాత కూడా కరోనా వైరస్ యాక్టివ్ గా ఉంటోందని అప్పుడే తేలింది. అలాంటి గదుల్లో రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు వైరస్ వ్యాపిస్తుందని వారి పరిశోధన స్పష్టం చేసింది.

మగవారిలో కరోనా ఇందుకే ఎక్కువట!

దీనిని బట్టి మనకు అర్థమైంది ఒక్కటే. గాలిలో వైరస్ ఉంటుందన్న మాటే గుబులు పుట్టిస్తే.. ఇప్పుడు ధూళిలో కూడా వైరస్ ఉంటుందని తేలడంతో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఇప్పటికైనా అందరూ మాస్కులు వాడడం, చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరం పాటించడం చేస్తే.. చాలావరకు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుంది. ఈ సంగతి మాత్రం మర్చిపోవద్దు.

Also Read : దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇలా అయితే బతికినట్టే పో.. !

Also Read : Corona Bharatham : మహాభారతంలోని ఈ రెండు కథలు చదివితే.. కరోనా పై యుద్ధం ఎలా చేయాలో తెలుస్తుంది

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : Also Read : ఎర్ర చీరలో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage