Politics

Corona Bharatham : మహాభారతంలోని ఈ రెండు కథలు చదివితే.. కరోనా పై యుద్ధం ఎలా చేయాలో తెలుస్తుంది

Corona Bharatham : ఎవరో జ్వాల ను రగిలించారు …  వేరెవరో దానికి బలి అయినారు అన్నట్టు ఎవడో వైరస్ ను తయారుచేసి ప్రపంచం పైకి వదిలాడు . ఇప్పుడది ప్రతి ఇంటి తలుపు తడుతోంది . కుటుంబాలకు కుటుంబాలు వైరస్ తో (Corona Bharatham) యుద్ధం చెయ్యాల్సి వస్తోంది. ఎస్ .. అది యుద్ధమే ! ప్రజలెవ్వరూ కోరుకోని యుద్ధం . ఇంటిపట్టునే ఉండిపోయినా తలుపు సందులోనుంచే టాయిలెట్ హోల్ నుంచో శత్రువు ఇంటిలోకి దూరేసాడు . ఇక వాడితో యుద్ధం అనివార్యం.

యుద్ధభూమి లోకి వెళ్లే సైనికుడికి యుద్ధం ఎలా చెయ్యాలో చెప్పాలి . మెళకువలు నేర్పాలి . గెలుస్తావన్న దైర్యం ఇవ్వాలి. ఆలా కాకుండా యుద్ధం లో మరణించిన వారి ఫోటో లో వీడియో లు చూపి వామ్మో .. వాయ్యో యుద్ధం చేస్తే చస్తావు .. ఆ శత్రువు అరివీర భయంకరుడు లాంటి మాటలు చెబితే ఎలా?

మహా భారతం లో శల్యుడు అనేవాడు ఒకడు వుండేవాడు . కర్ణుడికి రథ సారథిగా చేరాడు . కర్ణా ! నీ పేస్ చూడు .. శత్రువు ఓ మహమ్మారి. దానితో తలబడితే ఇక అంతే ! ఇదిగో చూడు .. ఆ శత్రువు తో తలబడి క్షతగాత్రులై ఆసుపత్రి ముందు.. వాహనాల్లో చికిత్స కోసం నిలబడిన వారిదిగో ! ఆ సైన్యం తో తలబడి మరణించి దహనానికి కూడా నోచుకోని శవాలు ఇవిగో ! నువ్వు యుద్ధం చేయలేవు . దాక్కో ! పారిపో … అంతో హితవచనలు పలికాడు.

మా అమ్మ తోడు చెబుతున్నా ! మహాభారతంలో ఒక్క శల్యుడే ఉన్నాడు. కానీ, కలియుగం లో ఇంత మంది శల్యులు తయారవుతారని, కొన్ని కోట్ల మంది యోధులను మానసికంగా దెబ్బ తీస్తారని నేను అనుకోలేదు . నా పాత్ర నేను సరిగ్గానే పోషిస్తున్నాను అనే తృప్తి ఒక పక్క వున్నా.. ఇంత మంది శల్యులను ఎదుర్కోలేని దౌర్బల్యం నాది ! మానవత్వమా ! క్షమించు !!

దయచేసి కరోనాపై పోరాడే ధైర్యాన్ని ఇవ్వండి. అంతేకానీ వాళ్లను భయపెట్టవద్దు.

 

ఇప్పుడు ఇంకో కథ చదువుదాం..

పాండవులు ! యుద్ధం వద్దనుకున్నారు ! అందుకే వూరికి దూరంగా వెళ్లిపోయారు . { భౌతిక దూరం – అరణ్య వాసం } … ముసుగు కూడా ధరించారు . { మాస్క్ – అజ్ఞాత వాసం } .

అయినా యుద్ధం అనివార్యమయింది . ముసుగు వేసుకొని ఎక్కడో దూరంగా విరాట్ రాజు కొలువు లో వున్నా శత్రువు వెతుకొంటూ వచ్చాడు . సవాలు విసిరాడు .

అయినా యుద్ధం ప్రాణహాని కి కారణం అవుతుందని శాంతియుత మార్గం కోసం ప్రయత్నించారు . రాయబారాలు పంపారు . అయినా యుద్ధం ముంగిట నిలిచింది .

యుద్ధభూమిలో నిల్చున్న అర్జునుడు తటపటాయిస్తున్నాడు . అప్పుడు నల్లనయ్య ” అయ్యా ! యుధుడివై పుట్టి యుద్ధం చేయడానికి ఆలోచిస్తే ఎలా ? ఈ యుద్ధం నువ్వు కోరి తెచ్చుకొంది కాదు . ఆగమంటే ఆగదు . యోధుడిలా యుద్ధం చెయ్యి ” అన్నాడు .

నీలమేఘ శ్యాముని ఆశీర్వాదం తో చెబుతున్నా ! అవకాశం ఉంటే ఇంటి పట్టునే మరో నాలుగు వారాలు వుండండి . మాస్క్ పెట్టుకోండి . కానీ అన్నింటికంటే ముఖ్యం యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా వుండండి . మానసికంగా అధైర్య పడొద్దు . మనిషిగా పుట్టినందుకు వైరస్ తో యుద్ధం అనివార్యం . ఇప్పుడే కాదు . ఇంకా చాల కాలం పాటు ! వైరస్ తో యుద్ధానికి మనకున్న ఆయుధం ఇమ్మ్యూనిటి . ఇంకా వాక్సిన్ . ( వాక్సిన్ అంటే మందు కాదు ! ఇమ్మ్యూనిటి పెంచుకోవడానికి ఒక మార్గం ! ) అర్జునుడు బృహన్నలాగా మారినప్పుడు విలువిద్య మరచి పోయాడా ? మీరు ఇంటి పట్టునే వున్నా మీ వయస్సు ఎంతైనా మీ ఆయుధం ఇమ్మ్యూనిటి .. అదే మీకు యుద్ధం లో రక్షణ ! గెలుపు మీదే ! యుద్ధం రాకుండా చూసుకోండి . వస్తే శత్రువును చీల్చి చెండాడండి ! విజయోస్తు.

– వాసిరెడ్డి అమరనాథ్ గారి వాట్సప్ పోస్ట్ నుంచి సేకరణ

 

Also Read : దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇలా అయితే బతికినట్టే పో.. !

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Akhanda Teaser : అఖండ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ తో దుమ్మురేపిన బాలయ్య బాబు

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage