Politics

ఈటెల పై CM KCR సీరియస్.. క్రమశిక్షణ చర్యలు..!

KCR : మాజీ మంత్రి ఈటెల వ్యవహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) సీరియస్ అయ్యారు. తనపైన ఎదురుదాడి చేయడంతో, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు.

ఈటెల వ్యవహారం పై టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ద్రుష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా ఈటెల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కాగా మెదక్ జిల్లాలోని మూసాయి పేటలో రైతుల భూములను ఈటెల కబ్జా చేశారన్న నేపధ్యంలో మంత్రి పదవి నుంచి ఈటెలను తొలిగిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మంత్రి పదవి తొలిగింపు అనంతరం నిన్న మీడియాతో మాట్లాడిన ఈటెల టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు మీద గెలిచామని మీరంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనని అన్నారు.

నా రాజకీయ జీవితం తెరిచినా పుస్తకమని, 19ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతిరహిత నాయకుడిగా పేరు సంపాదించుకున్నానని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రలోభ పెట్టిన లొంగలేదని, పార్టీకి, ప్రభుత్వానికి ఏనాడూ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని అన్నారు.

ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న ఏ ఒక్క మంత్రి కూడా ఆత్మగౌరవంతో ఉన్నామని చెప్పుకోలేరని అన్నారు. తానూ రాజీనామా చేసేముందు హుజరాబాద్ ప్రజలతో ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

ఈటెల వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపడంతో ఆయన పైన గులాబీ బాస్ గరంగరంగా ఉన్నారు.

Also Read :