Sai pallavi :  చెల్లెలిగా వద్దు హీరోయిన్ గానే కావాలి : చిరంజీవి
Cinema Latest

Sai pallavi : చెల్లెలిగా వద్దు హీరోయిన్ గానే కావాలి : చిరంజీవి

Sai Pallavi : మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో నటించాలని అని ప్రతి ఒక్క నటుడికి ఓ డ్రీమ్ లాగా ఉంటుంది. అవకాశం వేస్తే అదో అదృష్టంగా భావిస్తూ ఉంటారు కూడా.. కానీ అలాంటిది హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) మాత్రం వచ్చిన ఆ ఛాన్స్ ని మిస్ చేసుకుంది.

అవును… ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ… తాను చేయబోయే ఓ సినిమాలో చెల్లి పాత్ర కోసం సాయిపల్లవిని అనుకున్నాం. ఆ పాత్ర సాయి పల్లవి చేస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించాం. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో సంతోషం వేసిందని అన్నారు చిరు.

ఎందుకంటే అంత మంచి డాన్సర్ తో డాన్స్ చేయాలి అనుకుంటారు కానీ… చెల్లెలుగా అంటే నా మనసు అంగీకరించదంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.. ఇక సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు చిరు.

చిరంజీవి కామెంట్స్ పైన స్పందించింది సాయిపల్లవి..తనకు రీమేక్‌ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని చెప్పుకొచ్చింది. తనకి మరో అవకాశం ఇవ్వాలని కోరింది. చిరంజీవితో కలిసి సాయి పల్లవి స్టెప్స్ వేయడం మొత్తం ఈవెంట్ కి హైలెట్ గా నిలిచింది.

Also Read : 

– Bigg Boss 5 Telugu : అందుకే ఈ సారి బిగ్‌బాస్‌ రేటింగ్ తగ్గిందా?

– Huzurabad By Poll : కావాలనే హుజురాబాద్ లో పొలిటికల్ హీట్ తగ్గించారట..!

– Samantha : సమంత, నాగచైతన్య మధ్యలో శ్రీరెడ్డి..!

– Bigg Boss 5 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్ లోకి హాట్ యాంకర్..!

For More Updates Follow us on – Sirimalli Page