Bigg Boss 5 Telugu Sarayu : అందువల్లే సరయూ ఎలిమినేట్‌.. కారణాలు ఇవే..!
Bigg Boss 5 Telugu Latest

Bigg Boss 5 Telugu Sarayu : అందువల్లే సరయూ ఎలిమినేట్‌.. కారణాలు ఇవే..!

Bigg Boss 5 Telugu Sarayu : పంతొమ్మిది మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అప్పుడే మొదటివారం పూర్తి అయిపొయింది. యాంకర్‌ రవి, హమీదా, జెస్సీ, సరయూ, మానస్‌, కాజల్‌ తొలివారం నామినేషన్‌లోకి వెళ్ళగా ఫైనల్ గా సరయూ(Bigg Boss 5 Telugu Sarayu) ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ లో అందర్నీ దమ్‌దమ్‌ చేస్తానన్న ఆమె మొదటి వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం అభిమానులను షాక్ కి గురిచేసింది. ఆమె ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..!

  • సరయూను మానస్‌, కాజల్‌, వీజే సన్నీ ఈ ముగ్గురు నామినేట్‌ చేశారు. ఒకవేళ వీరిలో ఏ ఒక్కరు ఆమెను నామినేట్‌ చేయకపోయినా ఆమె నామినేషన్‌ జోన్‌లోకి వచ్చేదే కాదు.

 

  • ఇక హౌజ్ లో అందరినీ కలుపుకుపోయిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. పోనీ తన పనే తానూ చేసుకుందా అంటే అది లేదు.. అనవసరంగా గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది.

 

  • ఇక నామినేషన్ లోకి వెళ్ళినప్పుడు మిగతా కంటెస్టెంట్లతో పోటీ అయిన ఉండాలి లేకా స్క్రీన్‌ స్పేస్‌ కోసం ప్రయత్నించాలి కానీ ఈ రెండింటిలోనూ సరియూ వెనకబడింది.

  • టాస్క్‌ల మీద కన్నా ఇంటి పనుల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

 

  • అటు కెప్టెన్సీ టాస్కులో అయితే హౌస్‌మేట్స్‌ మద్దతు ఇవ్వొచ్చు, డిస్టర్బ్‌ కూడా చేయొచ్చు అని బిగ్‌బాసే స్పష్టంగా చెప్పినప్పటికీ కాజల్‌, విశ్వను ఒక్కడినే టార్గెట్‌ చేయడాన్ని సరయూ సహించలేకపోయింది.
    అనవసరంగా ఆమెతో గొడవ పెట్టుకుంది. ఆ గొడవలో మాటలు జారింది.

 

  • బిగ్ బాస్ అంటే బుల్లితెర షో .. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో.. ఆమె బూతులు మాట్లాడడం, హౌజ్ లో స్మోకింగ్ చేయడం చాలామంది తప్పుగా భావించారు. దీనితో ఆమెకి ఓట్లు పడలేదు.

Also Read :