Bigg Boss 5 Telugu : అందుకే ఈ సారి బిగ్‌బాస్‌ రేటింగ్ తగ్గిందా?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్.. నార్త్ లో మొదలైన ఈ షో మెల్లిమెల్లిగా సౌత్ లోకి పాకి.. ఇక్కడ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటుంది. తెలుగులో నాలుగు సీజన్ లను కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా ఐదో సీజన్ (Bigg Boss 5 Telugu )లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 05న గ్రాండ్ మొదలైన ఈ ఐదో సీజన్ కి టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ముచ్చటగా మూడోసారి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తో తెలుగులో భారీ అంచనాలతో బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ మొదలైంది. అప్పట్లో లాంచ్‌ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌లో తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. మూడో సీజన్ కి కూడా నానినే హోస్ట్ గా అనుకున్నారు కానీ హోస్ట్‌గా చేయలేనని నాని చేతులెత్తేయడంతో కింగ్ నాగార్జున వైపు మొగ్గు చూపారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు

అప్పటికీ మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షోని సక్సెస్ఫుల్ గా నడిపించిన సత్తా ఆల్రెడీ నాగ్ కి ఉంది. దీనితో బిగ్ బాస్ సీజన్ 3 పైన అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అంచనాలకి తగ్గట్టుగానే అనూహ్యంగా 17.92 టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. ఆ తరువాత నాలుగో సీజన్ తో తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నాడు నాగ్. ఏకంగా నాలుగో సీజన్ కి 18.5 టీఆర్పీ వచ్చింది. దీనితో ఐదో సీజన్ కూడా నాగ్ నే హోస్ట్ గా తీసుకున్నారు నిర్వహకులు.

భారీ అంచనాలతో మొదలైన ఐదో సీజన్ రేటింగ్ మాత్రం పడిపోయింది. ఈ సారి 18 టీఆర్పీ వచ్చింది. ఈ విషయాన్ని నాగ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. అయితే ఈసారి రేటింగ్ ఎందుకు పడిపోయింది అన్న విషయం పైన సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

బిగ్ బాస్ అంటే ముందుగా కంటెస్టె్ంట్లు ఎవరున్నారు అన్న ఆసక్తి ప్రేక్షకులలో ఎలా ఉంటుందో.. హోస్ట్ విషయంలో కూడా అంతే ఉంటుంది. షోని అన్ని రోజులు నడిపించే క్యాండెట్ ఎవరా అని క్యూరాసిటీ ఉంటుంది. మొదటి సీజన్ వన్ ని హోస్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఎలా చేస్తాడు అసలు షో ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

అందుకే షోకి మంచి టీఆర్పీ వచ్చింది. ఇక సీజన్ టూ విషయంలో గేమ్ ఎలా ఉంటుందో తెలిసిన .. స్టార్ హీరో ఎన్టీఆర్ తో మొదలైన  బిగ్ బాస్ షోని చిన్న హీరో అయిన నాని ఎలా నడిపిస్తాడుు? ఎన్టీఆర్ ని బీట్ చేస్తాడా అన్న అనుమానాలు మొదలవ్వడంతో షో పైన మరింత ఇంట్రెస్టింగ్ వచ్చింది. దీనితో టీఆర్పీ ఇంకాస్త పెరిగింది.

ఇక మూడో సీజన్ అసలు బిగ్ బాస్ అంటే చూడానన్న నాగార్జున సీజన్ ని ఎలా నడిపిస్తాడన్నది అప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్.. అప్పటికీ హోస్ట్ గా ప్రూవ్ అనిపించుకున్న నాగ్ తో రియాలిటీ షో అనేసరికి సీజన్ త్రీ పైన అంచనాలు పెరిగాయి. అలా సీజన్ త్రీకి టాప్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ సక్సెస్ కావడంతో ఆయనతోనే నాలుగో సీజన్ ని నడిపించారు నిర్వాహకులు. ఇది కూడా సక్సెస్ అయింది. ఈ సీజన్ కి హోస్ట్ మారుతారన్న చర్చ నడవడం, హోస్ట్ పైన ప్రోమోలు తీయడం వంటివి షో పైన అంచనాలను క్రియేట్ చేశాయి. దీనితో టీఆర్పీ విషయంలో నాగ్ తన రికార్డును తానే బీట్ చేశాడు.

అయిదో సీజన్ విషయంలో హోస్ట్ మారుతారు, నాగార్జునని కనిపించి కనిపించకుండా ప్రోమోలు చేయడం లాంటివి చేయకపోవడంతో ఈసారి కూడా నాగే షోని హోస్ట్ చేయనున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. మళ్ళీ హోస్ట్ నాగార్జున కావడంతో హోస్ట్ ఎవరా ఎవరా అన్న క్యూరాసిటీ ప్రేక్షకులో లేకుండా పోయింది.

దీనికి తోడు గత సీజన్ లలో కంటే ఈ సారి సీజన్ లో కంటెస్టె్ంట్లు పెద్దగా ఎవరికీ తెలియదు. దాదాపుగా కొత్తవారే.. ఇది కూడా రేటింగ్ పడిపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చునని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేటింగ్ తగ్గడంతో షో పైన బిగ్ బాస్ నిర్వాహకులు మరింత ఫోకస్ చేసే అవకాశం లేకపోలేదు. షోని మరింతగా రక్తి కట్టించేందుకు సన్నాహాలు చేస్తారేమో చూడాలి.

Also Read :