Bharti Singh: 12 రోజుల కొడుకును వదిలేసి నటి షూటింగ్.. నెటిజన్స్ ఫైర్..
Cinema Latest

Bharti Singh: 12 రోజుల కొడుకును వదిలేసి నటి షూటింగ్.. నెటిజన్స్ ఫైర్..

Bharti Singh: సినీ పరిశ్రమలో ఉండేవారికి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. కానీ వారు ఎక్కువగా ప్రేక్షకుల ఫోకస్‌లో ఉండడం వల్ల వారి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అవుతుంది. అందుకే వారిపై ట్రోలింగ్స్ జరుగుతుంటాయి. అయితే తాజాగా ఓ నటి కూడా తన 12 రోజుల కొడుకును వదిలేసి షూటింగ్ స్పాట్‌లో అడుగుపెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. దానికి ఆ నటి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది.

Also Read: https://www.sirimalli.com/today-19-april-2022-daily-horoscope-in-telugu/

సినిమాల్లో కమెడియన్లు అనగానే మనకు ముందుగా నటులే గుర్తొస్తారు. కానీ తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే నటీమణులు కూడా కొందరు ఉన్నారు. అలా బాలీవుడ్‌లో ఉన్న లేడీ కమెడియన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు భారతి సింగ్. ఓ చిన్న షోలో కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బుల్లితెరపైనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిపోయింది భారతి.

భారతి సింగ్ తన కో హోస్ట్ అయిన హర్ష లంబాచియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు కలిసి ‘ఖత్రా ఖత్రా ఖత్రా’ అనే షోను కూడా హోస్ట్ చేశారు. అయితే భారతి సింగ్ ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుండే తాను మిగతా మహిళలకు ఆదర్శంగా నిలవాలనుకుంది. అందుకే బేబి బంప్‌తో షోలను హోస్ట్ చేసింది. ఇక తన బిడ్డ పుట్టి 12 రోజులే అయినా షూటింగ్‌కు హాజరయ్యింది భారతి.

Bharti Singh Baby Boy Announcement Post: https://www.instagram.com/p/Cb42g9rPNaV/

భారతికి ఇంత తొందరేంటి? అప్పుడే షూటింగ్‌కు రావాల్సిన అవసరం ఏముంది అని నెటిజన్లు నెగిటివ్‌గా కామెంట్ చేయడంతో.. భారతి వీటిపై స్పందించింది. ‘ఎవరు ఎలా మాట్లాడినా మనం వాటిలో పాజిటివ్ విషయాలను మాత్రమే వినాలి. ఖత్రా ఖత్రా షో మా డ్రీమ్ ప్రాజెక్ట్ . అందుకే మేము దానిని పక్కన పెట్టలేం. నేను బాబును వదిలేసి రావట్లేదు. తనకు ఫీడ్ చేసిన తర్వాతే నేను బయటికి వస్తాను. బేబీని చూసుకోవడానికి ఇంట్లో చాలామంది ఉన్నారు.’ అంటూ తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై స్పందించింది భారతి.