Bellamkonda Sreenivas : బెల్లంకొండ పక్కన బాలీవుడ్ హాట్ బ్యూటీ..!
Cinema Latest

Bellamkonda Sreenivas : బెల్లంకొండ పక్కన బాలీవుడ్ హాట్ బ్యూటీ..!

Bellamkonda Sreenivas : బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈసినిమాని జయంతిలాల్‌ గడ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటకే లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్(Bellamkonda Sreenivas) శరవేగంగా జరుపుపుకుంటుంది.

Image

అయితే ఈ సినిమాలో బెల్లంకొండకు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించనున్నట్లుగా ముందునుంచి వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అనన్య పాండే, దిశా పటాని లాంటి పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశం నుష్రత్‌ బరుచాకి దక్కినట్టుగా తెలుస్తోంది. ఈ భామే బెల్లంకొండతో ఆడిపాడనుందట.

‘తాజ్‌ మహల్‌’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హాట్ బ్యూటీ ‘ప్యార్‌ కా పంచనామా 2’, ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘సోను కే టిటు కి స్వీటీ’ లాంటి చిత్రాలలో నటించింది. అందుకే నుష్రత్‌ ని దర్శకుడు వివి వినాయక్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఆమె పైన కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.

హైద‌రాబాద్‌, ముంబై లతోపాటు బంగ్లాదేశ్‌ల‌లో కూడా ఈ సినిమాను షూట్ చేయనున్నారట.

Also Read :