Bandla Ganesh : నిలకడ లేకపోతే కష్టం ‘బండ్ల’ బాబు.. ఇలా అయితే ఎలా?

Bandla Ganesh : “మాట తప్పను … మడమ తిప్పను.. నాది ఒకటే మాట -ఒకటే బాట.. నమ్మడం -నమ్మినవారికోసం బతకడం.. నా(Bandla Ganesh) మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను -నేను ఎవరిమాట వినను.. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను – పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను.

మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ
అందరికీ అవకాశం ఇచ్చారు.. ఒకేఒక అవకాశం నాకివ్వండి.. నేనేంటో చూపిస్తా …

నా పరిపాలన ఎంటో తెలియజేస్తా.. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం.. దానికోసం పోరాడతా… వారి సొంత ఇంటి కల నిజం చేస్తా
ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు… ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు

అందరి ఆశీస్సులు కావాలి.. ‘మా’ను బలోపేతం చేద్దాం.. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ది… చిహ్నం”

ఈ ట్వీట్ చేసి ప్రకాష్ రాజ్ కి బిగ్ షాక్ ఇచ్చాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. అవును.. ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని స్పష్టం చేశాడు గణేష్. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేధాల వల్లే బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్..

గతంలో మెగా ఫ్యామిలీపై జీవిత రాజశేఖర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు తమ ప్యానల్ వైపు రావడంతో బండ్ల బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు రావడంతో బండ్ల పై నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బండ్లకి అసలు క్లారిటీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఇలాగే గెలుస్తాం, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అంటూ నానా హంగామా చేసి చివరికి పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పేశాడు.

ఇప్పుడు ‘మా’ విషయంలో అంతే అవుద్ది అంటూ విమర్శిస్తున్నారు. ఇంకొందరు అయితే బండ్లకి నిలకడ అవసరమంటూ సలహాలు ఇస్తున్నారు.

Also Read :