Bandla Ganesh : కేసీఆర్ పాలన సూపర్.. ఈటెలను తీసేయడంలో తప్పే లేదు..! 
Latest Politics

Bandla Ganesh : కేసీఆర్ పాలన సూపర్.. ఈటెలను తీసేయడంలో తప్పే లేదు..! 

Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడియన్, నిర్మాత కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. మైక్ పట్టుకుంటే పూనకం వచ్సినవాడిలాగా మాట్లాడడం బండ్ల(Bandla Ganesh) స్పెషాలిటీ. ఈ క్రమంలో బండ్ల పలు కాంట్రవర్సీల గురి అవుతున్నాడు. తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఓ భూకబ్జా కేసుల ఆరోపణల నేపధ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ .. ఈటెల రాజేందర్‌‌ని మంత్రి పదవినుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. అనంతరం పార్టీని వీడారు ఈటెల.. అయితే దీనిపైన బండ్ల మాట్లాడుతూ… రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుందని, కేసీఆర్ ఒక్కడే బాగా చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈటెలను మంత్రి పదవినుంచి తీసేయడంలో తప్పేమీ లేదని అన్నారు. తనకి నచ్చనప్పుడు ఈటెల అయితే ఏంటి మరొకరు అయితే ఏంటి.. ఎవరినైనా తీసే అధికారం ఆయనకి ఉందని బండ్ల కామెంట్స్ చేశారు.

ప్రతి ఒక్కరు వచ్చి నీతో వచ్చి జెండా మోసాను కాబట్టి నేను కూడా పార్టీకి ఓనర్లమే అంటే ఎలా నడుస్తుంది. ముమ్మాటికి కేసీఆర్ ఒక్కడే టీఆర్ఎస్‌‌కి ఓనర్ అంటూ చెప్పుకొచ్చారు బండ్ల. గతంలో ఎన్టీఆర్ మొత్తం క్యాబినెట్‌‌ని తీసేసి కొత్తవాళ్ళను పెట్టుకోలేదా అంటూ గుర్తుచేశారు. అంతేకాకుండా పవర్ఫుల్‌‌గా ఓ ఉదాహరణను కూడా వదిలాడు బండ్ల.. తాజ్‌‌మహల్‌‌ని కట్టించింది షాజహాన్.. దానికి రాళ్లు మోసిన, పెయింట్ వేసిన ప్రతి ఒక్కరు వచ్చి తాజ్‌‌మహల్ మీదా హక్కులు ఉంటాయంటే ఎలా అని ప్రశ్నించారు.

అటు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మరో బీహార్ అవుతుందని పలువురు కామెంట్స్ చేశారని, ఆ సమయంలో తాను కూడా భయపడ్డానని కానీ ఇప్పుడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోనే ఉందని చెప్పుకొచ్చారు. తానూ కాంగ్రెస్ పార్టీకి అభిమాని అయిన.. కేసీఆర్ పాలన బాగుందని చెప్పుకొచ్చాడు. ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ vs రేవంత్ మధ్య మంచి పోటీ ఉంటుందని, ఆ పోటీ మంచి కిక్కిస్తుందని చెప్పుకొచ్చాడు బండ్ల. అటు మంత్రి ఈటెల పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ, రాజకీయ  వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారాయి.

Also Read :