Cinema

Akhanda Teaser : అఖండ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ తో దుమ్మురేపిన బాలయ్య బాబు

Akhanda Teaser : బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అందుకే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉంటాయి. కాని వారి ఊహలకు కూడా అందని రీతిలో బీబీ3 వర్కింగ్ టైటిల్ తో నిర్మాణమవుతున్న సినిమా (Akhanda Teaser) పోస్టర్స్, టీజర్ విడుదలయ్యాయి. అవి చాలా అద్భుతంగా వచ్చాయి. అందుకే వాటిని చూసిన తరువాత అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

Image

హర హర మహాదేవ శంభోశంకర అని బాలయ్యబాబు ఫస్ట్ డైలాగ్ ఉంటుంది. తరువాత కపాలం పగిలిపోద్ది అన్న డైలాగ్ అయిన వెంటనే ఓ ఫైట్ సీన్ ఉంటుంది. అది కళ్లారా చూడాల్సిందే కాని.. మాటల్లో చెప్పలేం. బోయపాటి శ్రీను సినిమాలో బాలయ్యబాబు యాక్టింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కరలేదు కదా. రోమాలు నిక్కబొడుచుకుంటాయంతే.

అసలు ఇప్పటివరకు బాలయ్యను ఇలాంటి లుక్ లో అభిమానులు చూడలేదు. అందులోనూ యాక్షన్ కు స్కోప్ ఉన్న సీన్స్ లో బాలకృష్ణ నటన ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ట్రెండ్ సెట్టర్ అయిపోతుందంతే. అందులోనూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. చెవులను కట్టిపడేసింది. ఇక ఉగాది రోజున టీజర్ రావడంతో ఫ్యాన్స్ కు రెండు పండుగలు ఒక్కసారి వచ్చినట్టయ్యింది.

Image

బాలయ్య బాబు మామూలుగా యాక్ట్ చేస్తేనే ఫ్యాన్స్ కు పూనకం వస్తుంది. ఇక సీన్ లో నందమూరి నట సింహం జీవిస్తే.. ఆ సన్నివేశాన్ని కళ్లారా చూడాల్సిందే. టీజర్ లో ఆ దమ్ముంది. సినిమా హిట్ పై ఫ్యాన్స్ లో జోష్ ని పెంచింది. నిజానికి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను బీబీ3 అనే పేరుతో ఇస్తూ వచ్చారు.

 

 Also Read : Monitor Lizard : ఆరడుగుల పొడవైన అడవి బల్లి.. థాయ్ లాండ్ లోని షాపులోకి వెళ్లి..

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage