Politics

Telangana Municipal Elections : తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. జీహెచ్ఎంసీలో ఆ డివిజన్ కు కూడా..

Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా అని అంతా ఎదురుచూశారు. ఇప్పుడు వార్డుల పునర్విభజన కూడా పూర్తవ్వడంతో ఎన్నికల ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎన్నికల (Telangana Municipal Elections)  నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ఇప్పటికే  2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల వార్డుల పునర్విభజన చేసిన మున్సిపల్ శాఖ

వార్డుల వారిగా ఓటర్ల జాబితాను సిద్దం చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

వరంగల్‌ కార్పొరేషన్‌ 66 డివిజన్లుగా విభజన

ఖమ్మం కార్పొరేషన్‌ 60 డివిజన్లుగా విభజన

అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డులుగా విభజన

సిద్దిపేట మున్సిపాలిటీ 43 వార్డులుగా విభజన

నకిరేకల్‌ మున్సిపాలిటీ 20 వార్డులుగా విభజన

జడ్చర్ల మున్సిపాలిటీ 27 వార్డులుగా విభజన

కొత్తూరు మున్సిపాలిటీ 12 వార్డులుగా విభజన

5వ తేదీన డ్రాఫ్టు ఓటరు జాబితా విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

9వ తేదీ వరకు అభ్యర్థనల స్వీకరణ 11వ తేదీన తుది జాబితా ప్రకటించనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏక్షణమైన ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం

 

జీహెచ్ఎంసీ పరిధి లో లింగోజీ గూడ డివిజన్ కు ఎన్నికలను నిర్వహించేందుకు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.

 

ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు మార్గదర్శకాలు విడుదల

5వ తేదీ న ఓటర్ల జాబితా విడుదల

6 నుంచి 9 వరకు అభ్యంతరాల స్వీకరణ

7వ తేదీన స్థానిక రాజకీయ పార్టీ లతో సమావేశం కానున్న ఎన్నికల కమిషన్

10వ తేదీ న అభ్యంతరాలను పరిశీలించనున్న అధికారులు

11వ తేదీన చివరి ఓటర్ లిస్ట్ ప్రచురించనున్న ఎన్నికల కమిషన్

తాజా అసెంబ్లీ నియోజక వర్గం ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్ఈసీ

 

మరింత సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage