Politics

AP Government : ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు.. 8 జిల్లాల్లో ఓకే.. కానీ ఆ ఐదు జిల్లాల్లో..

AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇచ్చింది. రోజురోజుకు కేసులు తగ్గుతుండడం, వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్లోకి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇప్పటివరకు ఉన్న కర్ఫ్యూ వేళలను ప్రభుత్వం (AP Government ) సవరించింది. ఇప్పటివరకు సాయంత్రం ఆరు గంటల వరకే ఉన్న ఈ మినహాయింపును రాత్రి 9 గంటల వరకు పెంచింది. కాకపోతే ఐదు జిల్లాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కర్ఫ్యూ కొత్త నిబంధనలు అమలు కావు. అంటే ఈ జిల్లాల్లో సాయంత్రం ఆరువరకే మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత కర్ఫ్యూ నిబంధనలు అమలు అవుతాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పాజిటివిటీ ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలకే ఈ మినహాయింపులని స్పష్టం చేసింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటును మళ్లీ పరిశీలించిన తరువాత అక్కడ కూడా కర్ఫ్యూ నిబంధనలు సడలించాలా వద్దా అన్నదానిపై మళ్లీ ఆలోచించనుంది ఏపీ సర్కార్.

Also read : ఏపీలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు.. మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు

Also Read :  AP Job Calendar : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జాబ్స్ క్యాలెండర్ విడుదల

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage