Off Beat

ఏపీలో కరోనా జోరు.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. దీనితో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసులు పెరుగుతుండటంతో చాలామందికి ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతుండగా.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరికిన వారికి ఆక్సిజన్ కొరత వస్తోంది.

గతేడాది ఏపీలోని ఆస్పత్రులకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్.. ప్రస్తుతం వంద టన్నులకు మించి ఆక్సిజన్ ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఆస్పత్రుల్లో ఆక్సిజనకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

అటు ఏపీలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు.

చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231 కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది