Cinema

Anasuya Bharadwaj : బాధ ఎక్కువైతే వైన్ తాగుతా.. మా ఆయనతో చెప్పుకుంటా – అనసూయ

Anasuya Bharadwaj : అందంగా, పొడుగ్గా, నాజూగ్గా, ఎప్పుడూ కిలకిలమని నవ్వుతూ నవ్వించే అందమైన అమ్మడు ఎవరంటే.. ఠక్కున గుర్తుకొచ్చే పేరు అనసూయ. స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు ప్రమోట్ అయ్యాక ఫుల్ బిజీ. ఎంతలా అంటే టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా అన్నింటిలోనూ బిజీ అయిపోయారు. అనసూయ (Anasuya Bharadwaj) నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్డే.

May be a close-up of 1 person

35 పుట్టినరోజులు జరుపుకుని.. ఇప్పుడు 36వ బర్త్ డే జరుపుకుంటున్న అనసూయలో అందం ఏమాత్రం తగ్గలేదు. అచ్ఛమైన తెలంగాణ అమ్మాయి. నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో పెద్దమ్మాయిగా పుట్టింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. ముందు పవిత్ర అని పేరు పెట్టాలనుకున్నా.. ఆమె తండ్రి మాత్రం వాళ్లమ్మ పేరే పెడతామన్నారు. అలా పవిత్ర అని పిలిపించుకోవాల్సిన అమ్మాయి.. ఇప్పుడు అనసూయగా తెలుగు ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటోంది.

May be a close-up of 1 person and standing

పుట్టుకతో బాగా రిచ్ అయినా.. తండ్రికున్న గుర్రపు పందేల వ్యసనంతో ఆ ఆస్తి కాస్తా హారతి కర్పూరమైంది. అందుకే ఒకానొక దశలో 50పైసలు మిగులుతాయని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులను కూడా ఫేస్ చేసింది. ఇంటి అద్దె కట్టడానికి కూడా ఇబ్బందులు తప్పలేదు. ఆ స్థితి నుంచి నేడు మంచి పొజిషన్ కు చేరుకున్నారు అనసూయ

May be a close-up of 1 person and standing

ఎంబీఏ హెచ్ఆర్ చేసిన అనసూయకు చదువంటే చాలా ఇష్టం. తరువాత ఓ సంస్థలో ఐదు వేల రూపాయిల జీతానికి హెచ్.ఆర్. గా ఉద్యోగం చేశారు. ఓ బ్యాంక్ లో టెలీకాలర్ గా సేవలు కూడా అందించారు. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో చేస్తున్న సమయంలోనే చాలామంది డైరెక్టర్స్ తో పరిచయం అయ్యింది. ఛాన్స్ లు కూడా వచ్చేవి. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడం, అప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అయిపోవడంతో ఆ ఛాన్స్ లను అలా వదులుకుంది.

May be a close-up of 1 person and outdoors

హెచ్ఆర్ గా సేవలు అందించాక.. ఆ జాబ్ కు రిజైన్ చేసి.. న్యూస్ రీడర్ గా మారింది. అప్పుడు కెమెరాను ఫేస్ చేయడం అలవాటైంది. తరువాత జబర్దస్త్ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తరువాత కూడా సినిమా ఛాన్స్ లు వచ్చినా.. స్టోరీ లైన్ నచ్చక నో చెప్పారు.

May be a close-up of 1 person

అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ లో చేయాల్సిందే. కాని, తాను సింగిల్ గా అయితేనే చేస్తా అనడం.. సినిమా టీమ్ ఒప్పుకోకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోక తప్పలేదు. నిజానికి అప్పటి నుంచే ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ లో కాస్త బాధపడినా.. తరువాత మాత్రం లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే మాత్రం అనసూయ సరైన రీతిలో సమాధానం చెబుతారు.

May be an image of 1 person and standing

హెచ్ఆర్ గా ఉన్నప్పుడే సుకుమార్ తో పరిచయం. ఆర్యలో ఛాన్స్ ఇచ్చినా.. కొన్ని పరిస్థితుల్లో భాగంగా వదులుకోక తప్పలేదు. యాంకర్ గా స్థిరపడినా.. తరువాత రంగస్థలంలో రంగమ్మత్తగా నటించమని సుకుమార్ ఆఫర్ ఇచ్చారు. అలా ఆ పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. నిజానికి ఇంత పేరును ఆమె కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు.

May be an image of 1 person and standing

కణం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయినా.. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనతో ముందుగా టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించారు. కథనం సినిమాలో యాక్టింగ్ కు మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఖిలాడీ, రంగమార్తాండ సినిమాలో చేస్తున్నారు. మలయాళం, హిందీలోనూ ఆఫర్స్ ఉన్నాయి. వెబ్ సిరీస్ లలోనూ యాక్ట్ చేస్తున్నారు.

May be an image of 1 person, standing, high-heeled shoes and outdoors

అనసూయకు శునకాలు, చిలుకలంటే ప్రేమ. అందుకే వాటిని పెంచుకుంటారు. వంట చేయడమంటే చాలా సరదా. భర్త సలహాలతోనే అంత స్టైల్ గా కనిపిస్తారు. పూర్తిగా వెజిటీరియన్. బాధగా అనిపించిన రోజున వైన్ తాగడం, ఆ బాధను భర్తకు చెప్పుకోవడం, తరువాత సంతోషంగా నిద్రపోవడం.. ఇది అనసూయ అలవాటు. యోగా, వర్కౌట్ల వల్ల తన శారీరక, మానసిక అందాన్ని ఇంతలా కాపాడుకుంటున్నారు అనసూయ.

May be a close-up of 1 person, standing and outdoors

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ పెరేడ్ కు వెళ్లినప్పుడు సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం అయ్యింది. తరువాత డిగ్రీలో కూడా ఫ్రెండ్ షిప్ అలాగే కంటిన్యూ అయ్యింది. ఇంట్లో వాళ్లు మాత్రం వీళ్ల ప్రేమను ఒప్పుకోలేదు. వేరే పెళ్లి సంబంధాలను కూడా చూశారు. అలా 9 సంవత్సరాల పాటు ప్రేమ పోరాటం చేస్తే.. అప్పుడు ఒప్పుకున్నారు. 2001లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు.

May be a close-up of 1 person, standing, sunglasses and outdoors

May be an image of 1 person, standing, tree and outdoors

Image

May be an image of 1 person, standing, outdoors and tree

 

May be an image of one or more people, sky and body of water

May be an image of 1 person and standing

May be an image of 1 person, standing and outdoors

May be an image of 1 person, standing and outdoors

May be an image of 1 person and jewellery

May be a close-up of 1 person, standing, jewellery, food and outdoors

May be a close-up of 1 person, hair and jewellery

ఇవి కూడా చదవండి : 

Also Read : Keerthi Reddy : నటి కీర్తిరెడ్డి ఇంట విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Also Read : Rashmika Mandanna : వాళ్ల ఇంటి కోడలినే అవుతానంటున్న రష్మిక! 

Also Read అందాలకు యువరాణి.. ఈ శివాని.. తమిళ స్మాల్ స్క్రీన్ లో బిగ్ బ్యూటీ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage