Cinema

Anasuya Bharadwaj : ఈ ఫోటోలు ఇప్పుడు అవసరమా అన్న నెటిజన్ కు.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

Anasuya Bharadwaj : ఈ ఫోటోలు ఇప్పుడు అవసరమా అన్న నెటిజన్ కు.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

Anasuya Bharadwaj 1
Anasuya Bharadwaj 1

Anasuya Bharadwaj : గోదారమ్మ కూడా ఆశ్చర్యపోతుందేమో.. అనసూయ మాటల ప్రవాహం స్పీడు చూసి.
పాలరాతి శిల్పం కూడా అసూయ పడుతుందేమో.. అనసూయ (Anasuya Bharadwaj) అందాన్ని చూసి.
అలాంటి సొగసు ఉన్న అనసూయ.. తెలుగు టెలివిజన్ కు తన గ్లామర్ తో కలరింగ్ ఇచ్చింది. టీవీ ఇండస్ట్రీ గ్రామర్ నే మార్చేసింది.

 

Anasuya-Bharadwaj2
Anasuya-Bharadwaj2

అనసూయ అంటే అందం. అందం అంటే అనసూయ అనేంతగా తెలుగు టెలివిజన్ చరిత్రలో మంచి పేరు సంపాదించుకుంది. అందులోనూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అంటే చాలా యాక్టివ్ గా ఉంటుందన్నమాట. అందుకే ఆమె ఏ ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా, కామెంట్ చేసినా తెగ వైరల్ అవుతుంది. ఈమధ్యే కొన్ని ఫోటోలు పెట్టింది.

 

Anasuya
Anasuya

అనసూయ ఫోటో షూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడమే ఆలస్యం.. అవి వెంటనే వైరల్ అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచం నలుమూలలా ఉన్న ఆమె ఫ్యాన్స్ కి క్షణాల్లో చేరిపోతాయి. అంతమంది అభిమానులు ఉన్నారామెకు. ఈమధ్యనే పెట్టిన ఫోటోలపై ఇప్పటికే ఆమెకు నెటిజన్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి.

తన ఫోటో షూట్ పై కామెంట్ చేసిన నెటిజన్ కు మాటలతోనే సెటైర్ వేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ. అసలే స్టైలిష్ యాంకర్.. ఆపై ఇంకా స్టైలిష్ టాకర్.. అంటే స్టైల్ గా మాట్లాడే యాంకర్ అని. సో బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేసిన అనసూయ ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసుగా. అలాగే జవాబిచ్చింది. ఇంతకీ ఆ నెటిజన్ వేసిన ప్రశ్న ఏమిటంటే..ఈ కరోనా కలకలం వేళ ఈ ఫోటోలు అవసరమా అని?

Anasuya
Anasuya

అనసూయను ఆ అభిమాని వేసిన ప్రశ్న ఒక్కటే. ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయడం కంటే ముందు.. దేశంలో కరోనా కేసులు, మరణాల గురించి మీకు బాధ లేదా అని ప్రశ్నించాడు. అంటే.. ఇలాంటి కష్టకాలంలో ఇలాంటి పోస్ట్ లు అవసరమా అన్న తీరులో కామెంట్ పెట్టడంతో అనసూయ కూడా అంతే స్థాయిలో సమాధానమిచ్చింది.

Anchor Anasuya
Anchor Anasuya

ఇలాంటి కష్టమైన సమయంలో కూడా ఎంటర్ టైన్ మెంట్ ని, నమ్మకాన్ని కొంతయినా తాము అందిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇలా పాజిటివ్ కోణంలో ఎందుకు ఆలోచించవంటూ చురకలు అంటించింది. గతంలో కూడా నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో అనసూయ ఆన్సర్లిచ్చింది. అయినా సోషల్ మీడియాలో అనసూయకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

Anchor Anasuya Bharadwaj
Anchor Anasuya Bharadwaj

రంగస్థలంలో రంగమ్మత్తగా కనిపించిన అనసూయ.. ఇప్పుడు పుష్పలో కూడా ఓ మంచి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నట్టే ఉంది. ఈ సినిమాతోనూ మరో మంచి హిట్ కొడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి :

Also Read :Jwala Gutta : గుత్తా జ్వాల పెళ్లి.. మహారాష్ట్రలో పుట్టి.. తెలుగు నేలపై పెరిగి.. తమిళ అబ్బాయిని పెళ్లాడి.. అసలు కథ ఏమిటంటే..

Also Read : Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Also Read : Anasuya Bharadwaj : భారీ సొగసులు, చలి గిలి పుట్టించే చూపులు.. అనసూయ సొంతం

Also Read : Corona  vitamin : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage