Ananya Panday: బాలీవుడ్‌లో మరో ప్రేమకథ.. స్టార్ హీరో తమ్ముడితో అనన్య..
Cinema Latest

Ananya Panday: బాలీవుడ్‌లో మరో ప్రేమకథ.. స్టార్ హీరో తమ్ముడితో అనన్య..

Ananya Panday: సినీ పరిశ్రమలో ఇద్దరు నటీనటులు కాస్త క్లోజ్‌గా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కథనాలు మొదలయిపోతాయి. ముఖ్యంగా ఈ కల్చర్ బాలీవుడ్‌లో మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ హీరో, హీరోయిన్ ఒక సినిమా కలిసి చేయగానే డేటింగ్ అంటూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. దీంతో బాలీవుడ్ మీడియా అంతా వారిద్దరికీ ప్రేమ, పెళ్లి అంటూ ఊహాగానాలు సృష్టించేస్తుంది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ చేరింది.

బాలీవుడ్‌లో హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా చాలావరకు నెపోటిజంతో వచ్చినవారే. అలా వచ్చిన యంగ్ బ్యూటీలే ప్రస్తుతం బీ టౌన్‌ను ఏలేస్తున్నారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన సీనియర్లు అందరూ మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించేస్తుంటే.. యంగ్ బ్యూటీలు టాప్ ప్లేస్‌ కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. అందులో ఒకరు చుంకీ పాండే కూతురు అనన్య పాండే.

Also Read: https://www.sirimalli.com/sunny-leone-is-charging-a-bomb-to-act-beside-manchu-vishnu/

కరణ్ జోహార్ లాంటి స్టార్ నిర్మాత అనన్య పాండేను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మొదట్లో అనన్య యాక్టింగ్‌కు విమర్శలు ఎదురైనా.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించడానికి తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. అయితే హిందీలో ఇంకా సరిగ్గా నిలదొక్కుకోలేకపోయినా.. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ అనే పాన్ ఇండియా చిత్రంలో చోటు దక్కించుకుంది అనన్య.

Ananya Panday With Ishaan Khatter: https://www.instagram.com/p/CHCbXkAg_Uz/

హిందీలో అనన్య పాండే నటించిన మూడో చిత్రం ‘ఖాళీ పీలీ’లో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌తో జతకట్టింది. అయితే ఈ సినిమా సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇషాన్‌కు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అనుకున్న బాలీవుడ్.. తాజాగా అనన్య పాండే పేరును తెరపైకి తెచ్చింది. అంతే కాకుండా షాహిద్ కపూర్ ఫ్యామిలీ వెకేషన్స్‌లో అనన్య కూడా కలవడం ఈ వార్తలు నిజమేనేమో అనిపించేలా చేస్తున్నాయి.