Actor Uttej : నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం..!
Cinema Latest

Actor Uttej : నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం..!

Actor Uttej : సినీ నటుడు, మాటల రచయిత ఉత్తేజ్(Actor Uttej)ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కటుంబ సభ్యులకు సీనీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.

ఈ రోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read :