Cinema Off Beat

Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

sonu-Sood
sonu-Sood

Sonu Sood : దేవుడంటే మనిషికన్నా శక్తివంతుడు. కానీ మనుషుల్లోనూ దేవుడుంటాడని మళ్లీ మళ్లీ నిరూపిస్తునే ఉన్నాడు సోనూసూద్. కిందటేడాది కరోనా సమయంలో వలస కూలీలకు అండగా నిలిచాడు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాడు సోనూసూద్ (Sonu Sood). ఎంతోమందికి భోజన వసతి సదుపాయాలు కల్పించాడు. ఆ తరువాత కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాడు. ఇప్పుడు మరొక అమ్మాయికి బతుకునివ్వడానికి సంతోషంగా ముందుకు వచ్చాడు.

కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైంది.. మహారాష్ట్రకు చెందిన భారతి. నాగ్ పూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. కానీ ఈ మహమ్మారి వల్ల ఆమె ఊపిరితిత్తులు దాదాపు 85 శాతం దెబ్బతిన్నాయి. దీంతో వైద్యులే ఆవేదన చెందారు. ఆమెకు మళ్లీ ఆరోగ్యాన్ని అందివ్వాలంటే ఊపిరితిత్తులైనా మార్చాలి.. లేదా మెరుగైన వైద్యాన్నయినా అందించాలని నాగ్ పూర్ డాక్టర్లు తేల్చిచెప్పారు.

Image

భారతి ఆరోగ్యం విషయం సోనూసూద్ కి తెలిసింది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు. వీలైనంతమేర ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. భారతికి చికిత్స చేస్తున్న డాక్టర్లతో మాట్లాడాడు. వాళ్లు చెప్పింది ఒక్కటే.. భారతికి సరైన ట్రీట్ మెంట్ ని అందించాలంటే ఆమెను.. హైదరాబాద్ లోని అపోలోలో జాయిన్ చేయాలని. అక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.

సోనూసూద్ వెంటనే హైదరాబాద్ లోని అపోలోలో వైద్యులతో మాట్లాడారు. భారతి పరిస్థితిని వివరించారు. వాళ్లు ఓకే చెప్పడంతో.. వెంటనే భారతిని నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు తరలించడానికి ఎయిర్ అంబులెన్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. దీంతో భారతిని తక్కువ సమయంలో అత్యంత సురక్షితమైన పద్దతిలో అపోలోకు చేర్చడానికి వైద్యులకు వీలైంది.
భారతి ఇప్పుడు అపోలోలో చికిత్స తీసుకుంటున్నారు.

Image

నిజానికి భారతి బతకడానికి కేవలం 20 శాతం మాత్రమే ఛాన్సుంది.. మరి ఆమెకు చికిత్స చేయిస్తారా అని సోనూసూద్ ని వైద్యులు అడిగారు. తప్పకుండా చేయిస్తా అని ఆయన సమాధానం ఇచ్చారు. సోనూ అంత ధైర్యంగా, అంత నమ్మకంగా జవాబివ్వడానికి కారణం ఒక్కటే. భారతి వయసు కేవలం 25 ఏళ్లు. అంటే ఆమెకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. ఆమె కోలుకుంటే.. భావి భారత పౌరురాలిగా సమాజానికి ఎంతో సేవ చేసే అవకాశముంది. సోనూ సూద్ ఆలోచించింది ఇదొక్కటే.

Image

25 ఏళ్ల వయసున్న భారతి తొందరగా కోలుకునే అవకాశముందని సోనూకు అర్థమైంది. అందుకే వెంటనే ఎయిర్ అంబులెన్స్ ని ఏర్పాటు చేయించారు. ఇక దేశంలోనే పేరున్న డాక్టర్ల టీమ్.. ప్రస్తుతం భారతికి ట్రీట్ మెంట్ ఇస్తోంది. అంటే.. ఆమె త్వరగా కోలుకునే అవకాశం చాలా ఉందని.. సోనూ చాలా నమ్మకంగా చెప్పాడు. అయినా నమ్మకానికి మించింది ఏముంటుంది.

Image

భగవంతుడిపైన అయినా నమ్మకం ఉంచే కదా పని చేస్తాం. సోనూ చేసింది కూడా అలాంటి పనే. సోనూ సూద్ నమ్మకం, వైద్యుల చికిత్స, భారతి కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలించి.. ఆమె త్వరగా కోలుకుంటే.. అంతకన్నా కావలసింది ఏముంటుంది. అయినా ఇప్పుడు భారతికి చేసిన సాయంతో సోనూసూద్ మరింతమంది మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. హ్యాట్సాఫ్ సోనూ సూద్

ఇవి కూడా చదవండి :

Also Read :Jwala Gutta : గుత్తా జ్వాల పెళ్లి.. మహారాష్ట్రలో పుట్టి.. తెలుగు నేలపై పెరిగి.. తమిళ అబ్బాయిని పెళ్లాడి.. అసలు కథ ఏమిటంటే..

Also Read : Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః

Also Read : Corona  vitamin : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage