Off Beat

పెళ్ళికి ప్రియుడు నో… శానిటైజర్‌ తాగి ప్రియురాలు ఆత్మహత్య..!

ఆమె ప్రేమించింది.. అతడు ప్రేమించినట్టు నటించాడు.. తీరా పెళ్లి చేసుకుందామని ప్రియురాలు అడిగితే కుదరదన్నాడు. దీనితో శానిటైజర్‌ తాగి ప్రియురాలు ఆత్మహత్యకి పాల్పడింది.

ఈ ఘటన సత్తుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రత్యూష(18) సిరిసిల్లాలో డిప్లొమా చదువుతోంది. కరోనా కారణంగా క్లాసులు లేకపోవడంతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది.

అప్పుడప్పుడు ఆమె అమ్మమ్మ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉండటంతో అక్కడకు వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో ఆ ఇంటికి పక్కనే ఉండే జగదీష్‌తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీనితో రోజు ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇలా 8 నెలలు గడిచిపోయాయి.అయితే పెళ్లి చేసుకుందామని జగదీష్‌ ని ప్రత్యూష అడగడంతో అతను పెళ్లికినిరాకరించాడు.

దీనితో మనస్తాపానికి గురైన ప్రత్యూష గత నెల ఏప్రిల్‌లో 30న హైదరాబాద్‌లో శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. ఆమె మృతికి జగదీశ్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు బషిర్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రత్యూష మృతదేహాన్ని జగదీష్‌ ఇంటి ఎదుట ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకి దిగారు.

Also Read :