Off Beat

బాబోయ్.. ఏపీలో వరుసగా రెండో రోజు భారీగా కేసులు..!

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. వరుసగా రెండో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,268 శాంపిల్స్ పరీక్షించగా 2,558 పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది. ఇక కరోనాతో తాజాగా మరో ఆరుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,268కి చేరింది. ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 915 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,93,651 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.